Purandeshwari: గత ప్రభుత్వం విధ్వంసంతో పాలన మొదలపెట్టింది 3 d ago

AP: విజయవాడలో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణ, ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేద్కర్ జయంతి నిర్వహణపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమాలపై పోలింగ్ బూత్ స్థాయి నేతలకు సూచనలు ఇచ్చారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన మొదలపెట్టారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ అవకతవకలపై బీజేపీ పోరాడిందని, అందుకే ప్రజలు తమ పార్టీని విశ్వసిస్తున్నారన్నారు.
వైసీపీ హయాంలో ఏపీకి ఒక్క పెట్టబడి కూడా రాలేదని, ఎవరికీ ఉపాధి దక్కలేదని చెప్పారు. మద్యం మాఫియాతో కలిసి వైసీపీ నేతలు దోచుకున్నారని, ఇసుక, మట్టిలోనూ అడ్డగోలుగా వ్యవహరించారని తెలిపారు. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా తయారయ్యాయన్నారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ సమన్వయంతో ముందుకెళుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీ - 4 కార్యక్రమం ప్రారంభించడం గొప్ప విషయం అని, పేదలకు ధనవంతులు చేయతనివ్వాలని సీఎం పిలుపునివ్వడం అభినందనీయమన్నారు.